News January 14, 2026

HYDద్‌లో ‘ఫిన్లాండ్’ చదువుల జోరు

image

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ‘హారిజన్ ఎక్స్‌పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్‌లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News January 23, 2026

జాన్‌పహాడ్‌లో నేడు పవిత్ర ‘గంధోత్సవం’

image

జాన్‌పహాడ్‌ సైదులు బాబా ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం శుక్రవారం వైభవంగా జరగనుంది. హైదరాబాద్‌ వక్ఫ్‌ బోర్డు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంధాన్ని ముజావర్లు గుర్రంపై ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్తారు. ఈ వేడుకను మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

News January 23, 2026

ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

image

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

News January 23, 2026

పల్నాడులో ఈ ఆలయాలను సంరక్షించాలి

image

మాచవరం మండలం రేగులగడ్డ గ్రామంలో ఉన్న పురాతన శిధిల ఆలయాలు హిందూ సనాతన ధర్మానికి చారిత్రక సాక్ష్యాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాలను సంరక్షించి పునరుద్ధరించడం అత్యంత అవసరం. భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.