News January 1, 2026
HYDని ‘బల్దియా’ ఎందుకు అంటారో తెలుసా?

GHMCని నగరవాసులు ‘బల్దియా’గా పిలుస్తారు. ఎందుకు ఈ పదం వాడతారో చాలా మందికి తెలియదు. పూర్వం HYDను ‘అత్రాఫ్‌బల్దా’గా పిలిచేవారు. అరబ్బీలో అత్రాఫ్ అంటే ఆవరణ, బల్దా అంటే పట్టణం. అదే అర్థంతో ఉర్దూలో నగర పాలక సంస్థను ‘బల్దియా’గా పిలవడం ప్రారంభమైంది. HYD నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఆసఫ్‌జాహీల పాలనలో ఉర్దూ అధికార భాష కావడంతో ‘బల్దియా’ ప్రజల నోట నాటుకుపోయింది.
Similar News
News January 2, 2026
HYD: సమ్మర్‌లో కరెంట్ కష్టాలకు చెక్!

వేసవి కాలంలో ఉక్కపోతతో నగరంలో అధికంగా ఏసీలు, ఫ్యాన్లు వినియోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలూ ఉంటాయి. ఈ సారి కోతలకు చెక్ పెట్టాలని విద్యుత్‌శాఖ చూస్తోంది. మహానగర వ్యాప్తంగా 20 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేసవి కాలానికి ముందే వీటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 2, 2026
HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 2, 2026
HYD: భార్యాభర్తలు.. మీకు ఇలాగే జరుగుతోందా?

అనుమానం ఆలుమగల మధ్య చిచ్చుపెడుతోంది. భార్య ఫోన్ చూసినా, భర్త ఇంటికి లేట్ వస్తే ఇంట్లో గొడవ జరుగుతోందని ‘గ్రేటర్ సిటీస్ ఆఫ్ కపుల్స్’ తెలిపింది. పని ఒత్తిడి, SMలో ఒక్కవీడియో చూస్తే, ఆల్గారిథం అలాంటివే చూపిస్తే వాస్తవం అనుకుంటున్నారు. ఓల్డ్ మెమొరీస్, పాస్‌వర్డ్ దాచడం వంటి చిన్నవాటితో అనుమానాలకు తావిస్తున్నారని HYD, ముంబైలో చేసిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాదిలోనైనా అన్యోన్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.


