News February 6, 2026

HYDలో అంతుచిక్కని Mystery!

image

విజయశాంతి సూసైడ్‌ కేసులో మిస్టరీ వీడలేదు. భర్తతో విభేదాలు, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు. మెరుగైన జీవనం సాగిస్తోన్న ఫ్యామిలీ రైల్వే పట్టాలపై మృతదేహాలుగా మారడం అంతు చిక్కడం లేదు. సాంకేతిక ఆధారాలు పరిశీలించగా 2 అఫీషియల్ కాల్స్‌ మాత్రమే ఉన్నాయట. కారులో లభించిన ల్యాప్‌టాప్‌ను సైతం FSLకి పంపారు. అయితే, తల్లితో పాటు పిల్లలు కూడా సూసైడ్‌ చేసుకోవడం వెనుక కారణం ఏంటనే కోణంలో SCR పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Similar News

News February 6, 2026

హైదరాబాద్‌ తాజ్‌మహల్‌ గురించి తెలుసా?

image

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్‌’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్‌ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్‌ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.

News February 6, 2026

HYDలో ఎక్కడికెళ్లినా రూ.5కే టిఫిన్!

image

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్లను ఇక విస్తరించనున్నారు. ప్రస్తుతం 150 పాత డివిజన్లలో క్యాంటీన్లు ఉన్నాయి. అన్ని క్యాంటీన్లలో లంచ్, 60 క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారు. ప్రస్తుతం GHMCలో 300 వార్డులు పెరగడంతో మరో 2 నెలల్లో ఇక్కడ కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గల్లీ నుంచి ORR వరకు రూ.5కే టిఫిన్, లంచ్ అందనుంది.

News February 6, 2026

HYD: బర్త్ డే రోజు Self Satisfaction ఇదే!

image

నగరంలో కొత్త ట్రెండ్‌ను యూత్ ఫాలో అవుతుంది. బర్త్ డే వస్తే దావత్‌లు చేసుకున్నా కిక్ రావడం లేదంటా. అందుకే సోషల్ యాక్టివిటీస్ పేరిట ఏదో ఒక సేవ చేస్తున్నారు. అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద పేదల కడుపు నింపుతున్నారు. అభాగ్యుల నడుమ కేక్ కట్ చేసి వారితో హైదరాబాద్ యువత హార్ట్‌ ఫుల్‌గా సంతృప్తి చెందుతుంది. కొందరు SMలో ప్రమోట్ చేసుకుంటుంటే.. మరికొందరు మూడో కంటికి తెలియకుండా సేవ చేస్తున్నారు.