News April 2, 2025

HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

image

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్‌పురా, చార్మినార్‌లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్‌ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్‌ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.

Similar News

News July 10, 2025

ఓయూ లా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల LLB, మూడేళ్ల LLB ఆనర్స్ ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఐదేళ్ల BA LLB, ఐదేళ్ల BBA LLB, ఐదేళ్ల BCom LLB 2, 6, 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

News July 10, 2025

బీపీఈడీ, డీపీఈడీ పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఓయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 10, 2025

సికింద్రాబాద్: 2,500 మంది పోలీసులతో బందోబస్తు

image

ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఈ రోజు జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ.1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.