News April 3, 2025
HYDలో ‘అతిథి దేవోభవ’ కరవు!

అతిథి దైవ సమానం. కానీ, తాజా ఘటనతో పరువు పోయింది. జర్మనీ యువతికి HYD చూపిస్తానని నమ్మించిన యువకుడు అత్యాచారం చేసి, ఆమె జీవితంలో మాయనిమచ్చను మిగిల్చాడు. గతంలో ఓ ఫారినర్‌కు వ్యాపారి రూ.100కు ఒక్క అరటి పండు అంటగట్టాడు. ఇది అన్యాయమని ఆ టూరిస్ట్ వీడియో వైరల్ చేశాడు. వాస్తవానికి HYD మతసామరస్యానికి నిలువుటద్దం. గొప్ప వారసత్వ సంపద ఉన్న నగరం. లక్షల మందికి ఉపాధినిస్తోంది. అలాంటి చోట ‘అతిథి దేవోభవ’ ఆచరించండి.
Similar News
News September 13, 2025
రేపు విజయవాడలో సదస్సు.. హాజరుకానున్న హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్

బాలికల సంరక్షణపై ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలికల రక్షణ, వారిపై నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు.
News September 13, 2025
విజయవాడ: బ్యాంక్ అకౌంట్ ఉందా..ఇది మీ కోసమే

సాధారణ ప్రజలను డబ్బులిచ్చి మభ్యపెట్టి వారి బ్యాంక్ ఖాతాను సైబర్ నేరస్తులకు అప్పగిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తాడి పరశురామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు ముఠాలోని ఇద్దరిని పట్టుకుని బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతా మొత్తం కిట్ ఆ ముఠాకు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని నేరస్తుల ముఠా మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.
News September 13, 2025
సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకుపోకుండా ఈ ఏడాది జిల్లాలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు డీఈవో శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుర్నూలు జిల్లాలో ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హాస్టళ్లు నిర్వహించేందుకు ఆసక్తి ఉండి, సేవాభావం కలిగిన పొదుపు, ఎన్జీవో సంఘాలు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.