News January 25, 2025
HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!
నగరంలో మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికితోడు ఆకతాయిలు చేసే స్టంట్‌లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News January 26, 2025
HYD: నేడు భారతమాతకు మహాహారతి కార్యక్రమం
HYDలోని పీపుల్స్ ప్లాజాలో నేడు భారత మాతకు మహాహారతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం భారతమాత విగ్రహాన్ని HMDA మైదానం నుంచి ఊరేగింపుగా నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లారు. సంవిధాన్ గౌరవ అభియాన్ యాత్ర నేడు ప్రారంభించి 2026 జనవరి 26 వరకు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
News January 26, 2025
HYD: చిట్టి భరతమాత.. అదుర్స్ కదూ!
రిపబ్లిక్ డే వేడుకలు గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పరిధి ఆరుట్లకు చెందిన శ్రుతి తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తెను భరతమాతగా అలంకరించి వావ్ అనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News January 26, 2025
HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్
దావోస్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.