News March 23, 2024

HYD‌లో ఆక్రమణలు.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

image

నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్‌లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్‌లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Similar News

News January 5, 2025

HYDలో పరిగి కానిస్టేబుల్ సూసైడ్

image

HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్‌పేటలోని తన నివాసంలో భాను శంకర్‌ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్‌ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2025

HYD: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TVS వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్ సాయంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2025

CMR కాలేజీ బాత్రూంలో వీడియో రికార్డింగ్.. ARREST

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కళాశాల నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై పోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని నందకిషోర్ (A1), గోవింద్ కుమార్(A2) ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.