News March 23, 2024

HYD‌లో ఆక్రమణలు.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

image

నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్‌లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్‌లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Similar News

News November 23, 2024

జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్

image

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.

News November 23, 2024

HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి

image

అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.

News November 23, 2024

HYD: WOW.. అందర్నీ ఆకట్టుకున్న రచన

image

హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.