News April 20, 2024
HYDలో ఆదివారం మటన్ షాపులు బంద్

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT
Similar News
News December 22, 2025
ఏరో స్పేస్ రంగంలో విస్తృత అవకాశాలు: ప్రో. రాములు

తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో.మామిడాల రాములు పేర్కొన్నారు. ఏరో స్పేస్ రంగ నిపుణులకు వృత్తి, ఉపాధి కల్పన రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని CSTD డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ముఖాముఖి చర్చలో రాములు పాల్గొన్నారు.
News December 22, 2025
HYD: రోటీన్ వదిలి ‘అండర్ గ్రౌండ్ గిగ్స్’లోకి

సిటీలో కుర్రకారు రూటు మార్చారు. రోటీన్ పబ్ కల్చర్‌ను పక్కనబెట్టి ‘బేస్ సంస్కృతి’ వంటి గ్రూపులు సైచిల్, ఎలక్ట్రానికా మ్యూజిక్‌తో నగరవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ గిగ్స్ నిర్వహిస్తున్నారు. ఇవి పీస్ లవర్స్‌కు ఇవి అడ్డాగా మారుతున్నాయి. స్ట్రీట్ కల్చర్ హైడ్ టీమ్ రాప్ బాటిల్స్, బీట్‌బాక్స్ వర్క్ షాప్‌లతో వీధుల్లో హిప్-హాప్ సెగలు పుట్టిస్తోంది. నయా మ్యూజిక్ ఇప్పుడు భాగ్యనగరంలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
News December 22, 2025
HYD: న్యూ ఇయర్ పార్టీ.. నిషాలో ఉంటే దెబ్బే !

సిటీలో న్యూ ఇయర్ జోష్ షురూ అయింది. ఈసారి 150కి పైగా మెగా ఈవెంట్లు నగరాన్ని ఊపేయనున్నాయని ఆర్గనైజర్స్ అంటున్నారు. పార్టీలంటే కేవలం చిందులు మాత్రమే కాదు.. సేఫ్టీ కూడా మస్ట్! అందుకే క్లబ్బులు, పబ్బుల్లో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి. వేడుక ముగిశాక మందుబాబులు స్టీరింగ్ పడితే అంతే సంగతులు. అందుకే మీ ఇంటి గడప వరకు సురక్షితంగా చేర్చేందుకు క్యాబ్ సదుపాయాన్ని నిర్వాహకులు తప్పనిసరి చేశారు.


