News January 23, 2026
HYDలో ఇక ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్!

సిటీలో ప్రాపర్టీ వెరిఫికేషన్ ఇకపై డిజిటల్ మయం కానుంది. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం బల్దియా సరికొత్త ‘సెంట్రలైజ్డ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్’ను సిద్ధం చేసింది. ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ 3ఏళ్ల ప్రాజెక్టు కోసం 70:30 రేషియోలో టెక్నికల్ బిడ్డింగ్ నిర్వహించాలని GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. దీంతో పన్నుల ఆడిటింగ్ సులభతరం కానుంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.