News January 8, 2026

HYDలో ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

image

ఇల్లు కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక కరెంట్, నీళ్ల కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఆ కష్టాలకు చెక్! పర్మిషన్ గడువు ముగిసినా, ప్లాన్ ప్రకారమే కట్టిన నాన్ హైరైజ్ భవనాలకు ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడువు దాటిన రెండేళ్లలోపు అప్లై చేస్తే పాత ఫీజులే, ఆ పైన అయితే కొత్త రేట్ల ప్రకారం ఛార్జీలు కట్టి సర్టిఫికెట్ పొందవచ్చు.
SHARE IT

Similar News

News February 20, 2026

HYD: మలి దశను మలుపు తిప్పిన మహోద్యమలు

image

ప్రత్యేక తెలంగాణ సాధనకు హైదరాబాద్ ఉద్యమాలకు కేంద్రబిందువైంది. ‘మిలియన్ మార్చ్’ ఉప్పెనలా ఉప్పొంగింది. ‘సాగరహారం’ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరిపోసింది. ‘సకలజనుల సమ్మె’ రాష్ట్రాన్ని స్థంభింపజేసింది. ‘మానవహారం’ ఉద్యమ ఆత్మను ప్రతిబింబించాయి. ‘సడక్‌బంద్‌’ సమైక్య పాలకులకు సమస్య తీవ్రతను చాటిచెప్పింది. చివరకు 2014 FEB 20న RSలో బిల్లు పాసై నాలుగున్నర కోట్ల మోముల్లో నవ్వులు పూశాయి.

News February 20, 2026

HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

image

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్‌(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్‌ ఒప్పుకున్నాడు.

News February 20, 2026

హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

image

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.