News March 10, 2025

HYDలో ఇవి ఇప్పుడు తప్పనిసరి

image

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
– నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.
– రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.
– దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
– ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు తిరగకూడదు.

Similar News

News September 18, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష: ఆసిఫాబాద్ SP

image

మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పోక్సో కేసు కింద 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేలు జరిమానాను కోర్టు విధించినట్లు ఆసిఫాబాద్ జిల్లా SP కాంతిలాల్ పాటిల్ ఈరోజు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక(8)పై 2023 డిసెంబర్ 10న అదే ప్రాంతానికి చెందిన M.రామేశ్వర్(23) లైంగిక దాడి చేశాడన్నారు. జైనూర్ PSకు అందిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

News September 18, 2025

అంగన్వాడీలకు పూర్తి భద్రత: మంత్రి సంధ్యారాణి

image

అంగన్వాడీలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లా మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబందించి గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. అలాగే వారికి టీడీపీ ప్రభుత్వమే గౌరవ వేతనం పెంచిందన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లకు 180 ప్రసూతి సెలవులు,20 రోజుల వార్షిక సెలవులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

News September 18, 2025

సంగారెడ్డి: ‘బాలలకు చట్టాలపై అవగాహన కల్పించాలి’

image

బాలలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. బాలికలను ఎవరైనా వేధిస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.