News November 30, 2024
HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB
HYDలో పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT
Similar News
News November 30, 2024
HYDలో పెరిగిన చలి.. ఒకరి మృతి
HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. నగర శివారు ఏరియాలు వణికిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీలు, గ్రేటర్‌లోని RCపురంలో 11.3 ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం గమనార్హం. జనవరి-24 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. చేవెళ్ల మం. ఖానాపూర్‌కి చెందిన మల్లారెడ్డి(40) లంగర్‌హౌస్‌లో చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చలిలో బీ కేర్ ఫుల్.
SHARE IT
News November 30, 2024
HYD: ప్రజా పాలనలో 6 గ్యారెంటీల అమలు: పటేల్ రమేష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌ది కాదని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పీఎం నాయకత్వాన్ని బలహీన పరచాలని హరీశ్‌రావు, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.
News November 29, 2024
బేగంపేటలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ మీటింగ్
బేగంపేటలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. నేషనల్ బయోడైవర్సిటీ సమావేశం వేదికగా, పట్టణీకరణ అంశాల గూరించి విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాజకోట మేయర్ పదాదియ, తదితర నేతలు పాల్గొన్నారు.