News January 29, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @236

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

Similar News

News January 29, 2026

HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్‌.. జింకల పార్కు

image

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.

News January 29, 2026

HYD: పైకం ఇంకెన్నడు ఇస్తరు?

image

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్‌లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 29, 2026

ఈ నంబర్లు సేవ్ చేసుకోండి.. HYDలో సేవ్ చేస్తాయి!

image

అత్యవసర సమయాల్లో ఏ సమస్యకు ఏ నంబర్లకు కాల్ చేయాలో మీ కోసం..
☞ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ☞ 102 గర్భిణులు& పిల్లల కోసం ☞ 1073 సిటీలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ☞1912 విద్యుత్‌శాఖ ☞1098 చైల్డ్ లేబర్ ☞ 104 హెల్త్ అడ్వైజ్ తీసుకోవడానికి ☞14567 సీనియర్ సిటిజన్స్ సహాయార్థం ☞ 1098 చైల్డ్ లేబర్ ☞ 1033 నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ఏర్పడితే ర్యాపిడ్ రెస్పాన్స్ ☞ 9440700906 షీ టీమ్స్ ☞ 9000113667 హైడ్రా
# SHARE IT