News January 29, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @236

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

Similar News

News January 29, 2026

కర్నూలులో తులం బంగారం ఎంతంటే?

image

కర్నూలులో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం 22 క్యారెట్ల తులం బంగారం (10 గ్రాములు) ధర రూ.1,63,650 .. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,78,550గా నమోదైంది. వెండి ధరలు సైతం పరుగులు తీస్తున్నాయి. కిలో వెండి ధర రూ.3,84,737 పలుకుతోంది. ధరలు క్రమేపీ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు పసిడి కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

News January 29, 2026

పెదకాకాని డ్వాక్రా ఉత్పత్తులకు దిల్లీలో భలే క్రేజ్

image

పెదకాకాని డ్వాక్రా మహిళల నైపుణ్యానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మన జిల్లా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఉంచేలా కేంద్ర మంత్రి పెమ్మసాని విశేష కృషి చేశారు. స్వయంగా ఆయన చొరవ తీసుకొని, అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఢిల్లీ వేదికగా తమ ఉత్పత్తులకు గుర్తింపు దక్కడంపై పెదకాకాని డ్వాక్రా మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

News January 29, 2026

రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/