News July 5, 2025
HYDలో ఎలక్ట్రిక్ ఆటోలు.. రయ్ రయ్

గ్రేటర్ HYD నగరంలో సుమారుగా 1.20లక్షలకుపైగా ఆటోలు ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. అయితే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలు, CNG, LPG, రెట్రో ఫిట్మెంట్ విభాగాల్లో దాదాపు 65వేలకుపైగా ఆటోలకు అనుమతులు అందజేసింది. సుమారు 20,000 వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇందులో ఉన్నాయి.
Similar News
News July 5, 2025
HYD: త్వరలో వాట్సప్ ద్వారా ప్రాపర్టీ టాక్స్ పేమెంట్

HYD త్వరలో వాట్సప్ ద్వారా GHMC ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ తదితర రెవెన్యూ బిల్లులు సైతం చెల్లించే అవకాశం ఉంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్ ఫాం సేవల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కోసం జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సహా వివిధ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.
News July 5, 2025
HYD: లక్షల టన్నుల మామిడి.. రూ.3 కోట్ల ఆదాయం.!

HYD నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం మార్కెట్లో ఈ సారి రికార్డు స్థాయిలో మామిడి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సుమారు 1.43 లక్షల టన్నుల మామిడి రాకపోకలు సాగగా మొత్తం సుమారుగా సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో, బాటసింగారానికి భారీగా తరలివచ్చింది.
News July 5, 2025
HYD: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.