News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.
Similar News
News January 9, 2025
GHMC: జనవరి 31 లాస్ట్ డేట్, తర్వాత చర్యలే!
గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 8, 2025
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే స్థానిక ఎన్నికలు: JAC
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని సర్పంచుల సంఘం JAC నిరసన తెలిపింది. అనంతరం నాంపల్లిలోని TG ఎన్నికల కమిషనర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.
News January 8, 2025
HYD: జైలులోనే డిగ్రీ, పీజీ చేశారు
HYDలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్షిక రిపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2024లో రాష్ట్రంలో జైలుకెళ్లిన వారిలో 750 మంది గ్రాడ్యుయేషన్, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసినట్లుగా పేర్కొంది. జైళ్లలో ఉండి చదువుకోవాలనుకున్న వారికి చెంగిచెర్ల, చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలోని జైళ్లలోనూ అవకాశం కల్పించారు.