News January 28, 2025
HYDలో ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు

ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు బిగించి HYDలో అడ్డంగా దొరికిపోయారు. సోమవారం సాయంత్రం నాగోల్‌లో అధికారులు తనిఖీలునిర్వహించారు. UP నుంచి HYD వస్తున్న ఓ వెహికిల్‌ను ఆపి చెక్ చేశారు. UP, AP, తెలంగాణ స్టేట్‌లకు చెందిన 3 నంబర్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఉన్నట్లు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసి నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతానికి తరలించినట్లు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన MIM మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 16 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక కలిసి వచ్చింది. కాగా ఈసారి కాంగ్రెస్‌కు అటు MIMతో పాటు TJS, CPI, CPM సహా పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు కూడగట్టడంలో CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరించడంతో ఆ పార్టీలు ఉపఎన్నికలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశాయి. దీంతో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీ విజయం సాధించింది.
News November 14, 2025
16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా

జూబ్లీహిల్స్ గడ్డపై 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేసింది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన ఏడాదే ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014లో TDP, 2018లో TRS, 2023లో BRS గెలిచాయి. ఈ ఉపఎన్నికలో గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండాను నియోజకవర్గంలో ఎగరేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
News November 14, 2025
చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అభినందించారు. ‘ఇది చారిత్రాత్మక విజయం. చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని, అనంతమైన అబద్దాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది’ అని అన్నారు.


