News April 10, 2025
HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్‌నగర్‌లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka
Similar News
News September 13, 2025
కూకట్‌పల్లి: రేణు అగర్వాల్‌ను చంపింది వీళ్లే..!

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్(50)ను ఇటీవల <<17699611>>దారుణంగా హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. యువకులు డబ్బు, నగల కోసం యజమానురాలిని తాళ్లతో కట్టేసి, గొంతులో కత్తితో పొడిచి, ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించగా ఇప్పుడు జైలులో కటకటాలను లెక్కిస్తున్నారు.
News September 13, 2025
ఉప్పల్ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూచిపూడి నాట్య గురువు రమేశ్ రాజ్ శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మూషిక వాహన, అదివో అల్లదిగో, రామాయణ శబ్దం, కృష్ణం కలయసఖి, గోవిందా గోవిందా, అయిగిరి నందిని వంటి అంశాలను సిరిశ్రీ, కీర్తన, చైత్ర, ప్రణుతి, బిందుశ్రీ, వర్షిణి, చైతన్య, జయంత్ తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
News September 13, 2025
శామీర్‌పేట్ నల్సార్ యూనివర్సీటీలో గవర్నర్

HYD శామీర్‌పేట్‌లోని నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.