News May 11, 2024
HYDలో కరెంట్ కట్.. KCR ఫైర్

HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్‌లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్‌స్టేషన్‌కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.
Similar News
News April 8, 2026
HYD: రూ.1200 కోట్ల భూమి కాపాడిన హైడ్రా

HYD గచ్చిబౌలి IT కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలోని ప్రభుత్వ జాగాను కాపాడింది. శేరిలింగంపల్లి ఖానామెట్‌లోని సర్వే నం.55లోని 8 ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. దీని విలువ రూ.1200కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
News April 8, 2026
చెన్నైకీ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

తెలంగాణలోని హైడ్రా పనితీరును అధ్యయనం చేసేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, వరద నియంత్రణలో హైడ్రా అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని ఈ బృందం కొనియాడింది. చెన్నై వంటి నగరాల్లోనూ ఇలాంటి సమన్వయ వ్యవస్థ ఏర్పాటు అవసరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.