News April 18, 2025

HYDలో కాంగ్రెస్, BRS లేకుండా ఎన్నికలు!

image

ఎన్నికలు వస్తే అధికార, ప్రతిపక్షాల మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అదేంటోగాని మన HYDలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకేనేమో ఈసారి MLC ఎన్నికల్లో INC, BRS దూరంగా ఉంటున్నాయి. ఇక గెలుపు కష్టమని తెలిసినా BJP డేర్ చేసింది. అభ్యర్థిని బరిలో నిలిపి బలం కూడబెట్టే ప్రయత్నం చేస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న MIM గెలుపు ధీమాతో ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే INC, BRS ఈ ఎన్నికపై నోరు మెదపకపోవడం గమనార్హం.

Similar News

News July 8, 2025

GHMC పరిధిలోకి మేడ్చల్?

image

గ్రేటర్ మరో కొత్త రూపంగా అవతరించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. GHMCలో ఇప్పటికే 24 నియోజకవర్గాలు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మేడ్చల్ మారడంతో ఇక్కడి మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో GHMCని 3 భాగాలుగా విభజిస్తామని ప్రకటించినా నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలను విలీనం చేస్తే HYD శివారు మరింత అభివృద్ధి కానుంది.

News July 8, 2025

ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.