News July 23, 2024

HYDలో కుక్కల బెడద.. GOOD NEWS

image

HYDలో కుక్కల బెడద కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గుడ్ న్యూస్ తెలిపారు. కుక్కల బెడద నివారించేందుకు ఇకపై ప్రత్యేక అపెక్స్ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పలు శాఖల అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మరోవైపు HYDలో వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని GHMC తెలిపింది.

Similar News

News February 19, 2026

HYD: TG FSLలో జాబ్స్.. పరీక్షల తేదీలివే..!

image

TG ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5, 6, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

News February 19, 2026

HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

image

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.

News February 19, 2026

HYD- విజయవాడ జస్ట్ 2.5 Hrs: మంత్రి!

image

రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి, RRR, NH-65 (8 లేన్ల విస్తరణ) ప్రాజెక్టులే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తైతే HYDకు విజయవాడ 2.5 గంటల్లో వెళ్లేలా చేరువకానుంది. హ్యామ్ (HAM) విధానంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణమే ధ్యేయమని, కేంద్ర నిధుల రాకపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.