News December 24, 2025
HYDలో కొత్తగా కల్చరల్ ట్రెండ్

HYDలో ఒక కొత్తగా కల్చరల్ ట్రెండ్ నడుస్తోంది. వర్క్ స్ట్రెస్ మధ్య నలిగిపోతున్న యువత ‘కళ’ల వైపు అడుగులు వేస్తోంది. క్లాసికల్ ఆర్ట్స్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చే ‘ఫ్యూజన్’ ప్రయోగాలు కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. భరతనాట్యాన్ని రాక్, జాజ్, సూఫీ మ్యూజిక్‌తో మిక్స్ చేస్తూ నైసీ జోసెఫ్ స్టూడియోస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్. ‘HYD.ART’ లాంటి ఇమ్మర్సివ్ వర్క్‌షాప్స్ యూత్ ఐకాన్లుగా మారాయి.
Similar News
News December 26, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్‌రావు కస్టడీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్‌రావు చెప్పారు.
News December 26, 2025
రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్‌మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్‌గా జయేశ్ రంజన్‌ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్‌గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్‌లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.
News December 26, 2025
ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.


