News January 3, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇద్దరి మధ్య 2-2-2 Bonding

image

HYD బిజీ లైఫ్‌లో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్‌, 2 నెలలకు ఓ వీకెండ్‌ ట్రిప్, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందనేది 2-2-2 సందేశం. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యం అంటున్నారు.

Similar News

News January 28, 2026

HYD నుంచి 900 స్పెషల్ బస్సులు

image

నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 900 బస్సులను నడుపుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులూ రంగంలోకి దిగి ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News January 28, 2026

బేగంపేటలో విమానాలు.. ఆకాశంలో విన్యాసాలు

image

బేగంపేట విమానాశ్రయంలో ఈరోజు నుంచి జరిగే విమాన ప్రదర్శనలో విన్యాసాలు నగరవాసులను అలరించనున్నాయి. ఈరోజు 11 నుంచి 11.30 వరకు, 12 నుంచి 12.30 వరకు, సాయంత్రం 4 నుంచి నుంచి అరగంటపాటు, రాత్రి 7 నుంచి 7:30 వరకు ఆకాశంలో విమాన విన్యాసాలు ఉంటాయి. సూర్య కిరణ్, మార్క్ జెఫ్రీ టీమ్స్ ఈ విమాన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఇప్పటికే దేశవిదేశాలనుంచి ఔత్సాహికులు ఈ ప్రోగ్రాం చూసేందుకు నగరానికి భారీగా వచ్చారు.

News January 28, 2026

JNTU గైడ్‌లైన్స్‌లో గందరగోళం.. విద్యార్థుల్లో వ్యతిరేకత

image

Way2Newsలో R&D విభాగంపై వచ్చిన కథనానికి JNTUHలో BOSలో ఆలోచన మొదలైంది. RRM సమావేశాలను బై కాట్ చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండా గైడ్‌లైన్స్‌ మార్చడంపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న గైడ్‌లైన్స్‌ ప్రకారం ముందుకు వెళ్తే విద్యార్థుల్లో వస్తున్న వ్యతిరేకతపై పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ గందరగోళానికి వర్సిటీ ఉన్నతాధికారులు ముగింపు పలకాలన్నారు.