News February 18, 2026

HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

image

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?

Similar News

News February 19, 2026

బాపట్ల తీరానికి ‘గోవా’ కళ

image

బాపట్ల తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు గోవాలో పర్యటించనుంది. తీర ప్రాంత నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి, బాపట్ల తీరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ బృందం 22న తిరిగి విజయవాడకు చేరుకోనుంది.

News February 19, 2026

ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

image

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.

News February 19, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.