News December 31, 2025
HYDలో కొత్త ట్రెండ్.. Food Rave

సిటీలో ఎక్స్‌పీరియెన్షియల్ ట్రెండ్ నడుస్తోంది. తినే తిండిలో మ్యూజిక్ ఉండాలి, చుట్టూ క్రేజీ లైటింగ్ ఉండాలి. దీని పేరే ‘ఫుడ్ రేవ్’. హైదరాబాద్‌లో ‘జెన్-జీ ఆటో ఎక్స్‌పో’ వంటి ఈవెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి. గ్యాడ్జెట్స్ కొన్నా, ఫ్యాషన్ డ్రెస్సులు వేసినా మన ప్రాంతీయ మూలాలు వెతుక్కుంటున్నారు. ఆన్‌లైన్ క్లాసులు వింటూనే, దోస్తులతో కలిసి ఆఫ్‌లైన్ హ్యాంగ్-అవుట్స్‌లో రచ్చ చేస్తున్నారు. ఈ జోష్ మామూలుగా లేదు.
Similar News
News December 31, 2025
మార్టిన్‌కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
News December 31, 2025
తిరుపతి SVU పరీక్షల వాయిదా

తిరుపతి SVU పరిధిలో జనవరి 5వ తేదీ నుంచి M.A, MSC, M.Com, M.S Data Science, M.Ed, M.Lisc రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. జనవరి 21 నుంచి నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులు గమనించాలని కోరారు. NET పరీక్షల నేపథ్యంలో PG సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని SFI నాయకులు రెక్టార్‌కు వినతిపత్రం అందజేశారు.
News December 31, 2025
భూపాలపల్లి ఆర్డీవోకు హనుమకొండ అదనపు కలెక్టర్‌గా పదోన్నతి

భూపాలపల్లి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న రవి బుధవారం బదిలీ అయ్యారు. ఆయన పదోన్నతిపై HNK అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వెళ్లనున్నారు. భూపాలపల్లిలో ఏడాది కాలంగా పని చేసిన రవి.. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, సింగరేణి భూసేకరణ వంటి కీలక ప్రక్రియలను వేగవంతం చేయడంలో విశేష కృషి చేశారు. కాగా, రవి స్థానంలో హరికృష్ణ ఆర్డీవోగా రానున్నారు. నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టనున్న హరికృష్ణ ఇటీవలే పదోన్నతి పొందారు.


