News October 3, 2025

HYDలో కొత్త లగ్జరీ హబ్.. కమల్ లైఫ్ స్టైల్ హౌస్

image

హైటెక్ సిటీలో కమల్ వాచ్ కో కొత్తగా ఏర్పాటుచేసిన కమల్ లైఫ్ స్టైల్ హౌస్‌ను బాలీవుడ్ నటి మౌని రాయ్ ఘనంగా ప్రారంభించారు. ఈ స్టోర్లో 50కి పైగా ప్రీమియం వాచ్ బ్రాండ్లు, బంగారు-వెండి ఆభరణాలు అమ్మే క్యారెట్ లేన్, స్వరోవ్స్కి జ్యువెలరీ, అంతర్జాతీయ సుగంధద్రవ్యాలతో వినియోగదారులకు ప్రత్యేక వ్యక్తిగత లగ్జరీ షాపింగ్ అనుభవం అందుతోందని నిర్వాహకులు తెలిపారు. లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది అని అన్నారు.

Similar News

News October 3, 2025

హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ

image

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌న్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎక‌రాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమ‌తిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పున‌రుద్ధ‌రించారు.

News October 3, 2025

కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

image

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.

News October 3, 2025

HYD: డబుల్ బెడ్ రూం పట్టాల పంపిణీ

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్‌‌పేట-134, బహుదూర్‌పురా-294, బండ్లగూడ-155, చార్మినార్-209, సైదాబాద్‌లో 206‌ మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతనం పట్టాలు పంపిణీ చేసినట్లు పొన్నం తెలిపారు.