News February 5, 2025
HYDలో ఖర్చులు భారం.. ఇల్లు గడవక తిప్పలు!

నగరంలో ప్రతినెల తలసరి నెలవారి ఖర్చు రూ.8978గా ఉందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని తెలిపింది. అడపాదడప నెలకు రూ.30 వేల ఉద్యోగం చేసే వారికి కుటుంబ పోషణకు, EMIలకు సరిపోక మిగతా చోట్ల పార్ట్ టైం చేస్తున్నట్లుగా CRN సంస్థ చెప్పుకొచ్చింది. మరోవైపు HYDలో ఆలుమగలు ఉద్యోగం చేసినా.. ఇల్లు గడవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్‌లైన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.
News November 8, 2025
మెదక్: దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు

టేక్మాల్ మండలం వేల్పుగొండలో తల్లిని కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తల్లి సత్యమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్న అతడు కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 8, 2025
కాలువలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువలో బొమ్మనహాల్ హెచ్ఎల్సీ సెక్షన్ పరిధిలో 116 కిలోమీటర్ల వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. శనివారం సాయంత్రం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలు ఎవరివనే సమాచారం తెలియ రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


