News August 23, 2025

HYDలో గుంతల చింతలు తీరేనా!

image

మహానగర రోడ్లపై గుంతలు ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. గుంతల రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అందుకే గుంతలను సాధ్యమైనంత త్వరగా పూడ్చేలా GHMC చర్యలు తీసుకుంటోంది. మహానగరంలో 12,696 గుంతలున్నాయని గమనించింది. కొద్ది రోజులుగా మరమ్మతులూ ప్రారంభించింది. ఇప్పటి వరకు 9,899 గుంతలను పూడ్చినట్లు  GHMC ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

HYD: పార్టీ మారిన MLAలపై KTR కామెంట్స్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూపించి, ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అని ఎద్దేవా చేశారు. BRS టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరలేదు అంటున్నారన్నారు.

News September 12, 2025

HYD: గ్రూప్-1పై BJP మౌనమేల: కేటీఆర్

image

సీఎం రేవంత్ రెడ్డి, BJP మ‌ధ్య ర‌హ‌స్య మైత్రి కొన‌సాగుతుందని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు మండిపడ్డారు. చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బ‌డే భాయ్ పార్టీ బీజేపీ ప‌హారా కాస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నొరుమెదపదెందుకు అని అన్నారు.

News September 12, 2025

HYD: ORR పరిధిలో 39 STPలు

image

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్లతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ- 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్లు కానున్నట్టుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.