News August 8, 2024
HYDలో గ్రామాల విలీనంపై కసరత్తులు!

ORR లోపలున్న పట్టణాలు, నగరాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORRకి అటూ ఇటూ ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాహ్యవలయ రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. ఆయ గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
Similar News
News February 19, 2026
హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి16న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీతో వారి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. VH అధిష్ఠానానికి లేఖ రాయగా, కీలక నేతలూ ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుమార్‌కు అన్యాయం జరిగిందని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నారు.
News February 19, 2026
వికారాబాద్ కొండలపై ఏపీ DCCలకు ట్రైనింగ్

హైదరాబాద్ శివారు ప్రాంతమైన అనంతగిరి గుట్టపై ఏపీకి చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ టి.కాంగ్రెస్‌కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతోపాటు ఏపీ డీసీసీ అధ్యక్షుడు ఈ నెల 21 నుంచి జరిగే శిక్షణలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మంది ఈ ట్రైనింగుకు హాజరవుతారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు రాహుల్ గాంధీ వచ్చే అవకాశముంది.
News February 19, 2026
ముంబైలో HYD ఫ్యూచర్ ప్లాన్ చెప్పేసిన రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో HYD ఎలా ఉండబోతోందో ముంబైలో చెప్పేశారు. ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను అక్కడ జరిగిన క్లైమేట్ వీక్ సదస్సులో వెల్లడించారు. తొమ్మిదేళ్లలో సిటీని నెట్ జీరో సిటీగా మార్చడం, విద్యుత్ వినియోగం 34 వేల మెగావాట్లకు పెంచడం, 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్ చేయడం, 3,500 ఆర్టీసీ బస్సులను ఈవీ బస్సులుగా మార్చడం.. మెట్రో రైల్ విస్తరణను 200 కి.మీ.కు విస్తరించడం లాంటి ప్లాన్స్‌ను వివరించారు.


