News February 16, 2025

HYDలో చికెన్ తింటున్నారా.. జాగ్రత్త!

image

HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
➢చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త.
➢ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి.
➢వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
➢చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయండి.
SHARE IT

Similar News

News November 3, 2025

రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.

News November 2, 2025

రంగారెడ్డి: ‘స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోండి’

image

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.

News October 31, 2025

HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

image

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.