News March 28, 2025
HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.
Similar News
News March 31, 2025
HYD: ‘స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించవద్దు’

తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు స్వస్తి పలకాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించ వద్దని ‘మాచన’ స్మోకర్స్‌ను కోరారు. పొగాకు ధూమపానం అలవాట్లు జీవితానికి చేదు అనుభవం మిగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 30, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 222 మంది చిక్కారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 30, 2025
హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ..!

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.