News December 19, 2025

HYDలో తగ్గిన ఎయిర్‌ క్వాలిటీ.. జాగ్రత్త!

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

SHARE IT

Similar News

News December 20, 2025

జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తితో యువత అందుబాటులోని పారిశ్రామిక పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటైన ఇగ్నైట్ సెల్‌ను ఆయన సందర్శించారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

News December 20, 2025

క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

image

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.

News December 20, 2025

కొత్త భవనాలకు ‘గ్రీన్ బిల్డింగ్ కోడ్’: విజయానంద్

image

AP: ఇంధన పరిరక్షణ, నెట్ కార్బన్ జీరో లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని CS విజయానంద్ పేర్కొన్నారు. ‘కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫీషియెంట్ ఎక్విప్‌మెంట్ వాడాలనే నిబంధన (Green Building Code)ను తీసుకువచ్చాం. ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ఏర్పాటును ప్రోత్సహించేలా గ్రీన్ ఎనర్జీ పాలసీ పెట్టాం. ఇంధన పొదుపుపై అవగాహనకు స్కూళ్లలో ఎనర్జీ లిటరసీ క్లబ్స్ నెలకొల్పాం’ అని వివరించారు.