News November 12, 2024

HYD‌లో తగ్గిన చికెన్‌ ధరలు!

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మొన్నటివరకు స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. నేడు స్కిన్ లెస్ రూ. 218, విత్ స్కిన్ రూ. 191కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
SHARE IT

Similar News

News December 15, 2025

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి: కిషన్‌ రెడ్డి

image

ఫిలింనగర్‌లో పర్వతాంజనేయ స్వామి ఆలయాన్ని ఆనుకొని భూములు అన్యాక్రాంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆలయం చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతిని ఆదేశించారు. ఆదివారం వినాయకనగర్‌ పర్వతాంజనేయ స్వామి ఆలయంలో పవర్‌ బోర్‌వెల్స్‌ను ఆయన ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

News December 14, 2025

HYD: PUBలు CLOSE అయ్యాక ఎక్కడికెళ్తున్నారో తెలుసా?

image

మిడ్‌నైట్ 12:30 క్లబ్‌‌‌లు మూతపడాలనే రూల్ ఉంది. కానీ, ఎంత రాత్రయినా యూత్ పార్టీ జోష్ తగ్గడం లేదు. పబ్‌ల నుంచి బయటికి రాగానే అంతా కలిసి 24/7 ఫుడ్ కోర్టులు, లేక్ సైడ్ హాంగ్‌ అవుట్‌లు, HYD శివారులోని ఫామ్‌హౌస్‌లకు పోతున్నారు. దీనికి ‘దక్కన్ మైగ్రేషన్’ అని పేరు పెట్టారు. ఈ మిడ్ నైట్ షిఫ్ట్‌తో టైమ్ అయిపోయిందన్న టెన్షన్ లేకుండా తమ ఫ్రెండ్స్‌తో కలిసి 24/7 టైమ్ స్పెండ్ చేసేందుకు కొత్త దారి వెతుకుతున్నారు.

News December 14, 2025

HYD: వెస్ట్ సిటీ‌లో కీలక మార్పులు

image

GHMC డీ-లిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వెస్ట్ సిటీ‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో కనీసం 4 నుంచి 5 కొత్త డివిజన్లు పెరగనున్నాయి. 2011 జనాభా, ఓటర్ల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రాంతాల్లోని ఓటర్లలో బిహార్, బెంగాల్, ఒడిశా వలసదారులు అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కొత్త డివిజన్లతో ఈ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారడం ఖాయం.