News April 19, 2025
HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.
Similar News
News July 8, 2025
HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్‌ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్‌ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్‌ను బయటకు తీశారు.
News July 8, 2025
GHMC పరిధిలోకి మేడ్చల్?

గ్రేటర్ మరో కొత్త రూపంగా అవతరించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. GHMCలో ఇప్పటికే 24 నియోజకవర్గాలు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మేడ్చల్ మారడంతో ఇక్కడి మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో GHMCని 3 భాగాలుగా విభజిస్తామని ప్రకటించినా నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలను విలీనం చేస్తే HYD శివారు మరింత అభివృద్ధి కానుంది.
News July 8, 2025
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.