News February 3, 2025
HYDలో త్రిష ట్రైనింగ్.. ఇదీ ఫలితం!
గొంగడి త్రిష.. U-19 క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తన ప్రతిభతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచారు. ఇంతలా పేరు తెచ్చుకున్న ఆమె మన తెలంగాణ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2013లో భద్రాచలం నుంచి HYDకి వచ్చిన రామిరెడ్డి 7 ఏళ్ల త్రిషను సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్ చేసిన త్రిష నేడు తన ప్రదర్శనతో HYDలో బెస్ట్ ట్రైనింగ్ ఉందని నిరూపించారు.
Similar News
News February 3, 2025
HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 3, 2025
ఇబ్రహీంపట్నం: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు
ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంటర్ విద్యార్థినిని మోసగించిన సహ విద్యార్థిపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా లొబరుచుకొని, మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడపడంతో బాలిక ఆత్యహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై గుంటుపల్లి సెక్టార్ ఎస్ఐ కేసు నమోదు చేశారు.
News February 3, 2025
మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.