News April 5, 2025
HYDలో దర్శనానికి సాయిబాబా నాణేలు

లక్ష్మీ భాయి షిండేకు షిర్డీ సాయిబాబా స్వయంగా అందించిన దైవికమైన 9 సాయి నాణేలు చాదర్‌ఘాట్ సాయిబాబా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న ఉ.11 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ నాణేలు ప్రదర్శించనున్నట్లు సాయిబాబా ఆలయ అధికారులు తెలిపారు. ఈ అరుదైన పుణ్యదర్శనాన్ని భక్తులు తప్పక వినియోగించుకోవలసిందిగా వారు కోరారు.
Similar News
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
News November 16, 2025
వరంగల్: వడ్డీ వ్యాపారుల గిరి గిరి తంతు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కానీ నియంత్రణ వ్యవస్థ నిమ్మకునీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది.
News November 16, 2025
మెదక్: ‘బాల్య వివాహం జరిగితే సమాచారం ఇవ్వండి’

మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
హేమ భార్గవి అధికారులు, ప్రజలకు విన్నవించారు. మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ఫొటోగ్రాఫర్‌లు, బ్యాండ్, పురోహితులు, పాస్టర్లు, ఖాజాలు, ప్రజలు జిల్లాలో ఎక్కడైనా వివాహం నిశ్చయం అవుతున్నట్లు తెలిసిన వెంటనే అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయస్సు తెలుకోవాలన్నారు.


