News September 21, 2025

HYDలో దారితప్పిన పొల్యూషన్ కంట్రోల్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో 83 లక్షలకు మించి వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో సరైన తనిఖీలు జరగకపోవడంతో పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు నిబంధనలను ఉల్లంఘించి జారీ చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 8,250 టన్నుల PM 2.5 ఉద్గారాలు వెలువడుతున్నాయని ARR రిపోర్ట్ వెల్లడించింది. దీంతో నగరంలో కాలుష్యం పెరుగుతోందని చెబుతోంది.

Similar News

News September 21, 2025

వర్గల్: మంత్రులకు విద్యాదరి క్షేత్రం శరన్నవరాత్రోత్సవాల ఆహ్వానం

image

వర్గల్ విద్యాదరి క్షేత్రంలో 22 నుంచి ప్రారంభం కానున్న శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం హైదరాబాదులోని మినిస్టర్ కార్యాలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి శేష వస్త్రాలతో మంత్రులను సత్కరిస్తూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో బిక్షపతి, మోహన్, ప్రభాకర్ ఉన్నారు.

News September 21, 2025

సిద్దిపేట: ‘హెచ్-1 బీ వీసా ఫీజుల పెంపుపై స్పందించాలి’

image

హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, అలాగే ఇటీవలి కార్మిక-ఆధారిత రంగాల్లో 25% సుంకం పెంపు, కేంద్ర ప్రభుత్వానికి జరిగిన దౌత్య పరాజయాన్ని ప్రతిబింబిస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు, అక్కడే పనిచేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు అమెరికా ప్రభుత్వంతో ప్రారంభించాలని ఎక్స్ వేదికగా హరీశ్ రావు కోరారు.

News September 21, 2025

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతి

image

TG: అధికారుల కళ్లుగప్పి 9 మంది యువకులు అనుమతి లేని జలపాతం వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ములుగు(D)లో జరిగింది. HYDలోని ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ 8మంది స్నేహితులతో కలిసి వాజేడు(M) కొంగాల జలపాతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం గట్టుమీద కూర్చొని కాలుజారి నీటిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.