News July 30, 2024
HYDలో ధార్ గ్యాంగ్ కదలికలు.. జాగ్రత్త!
ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘట్‌కేసర్ క్రైమ్ ఎస్ఐ అశోక్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ధార్ గ్యాంగ్ కదలికలు కనిపించాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే ఫోన్ చేయాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ పలు చోట్ల చోరీలకు పాల్పడిన విషయం విదితమే.
Similar News
News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News January 18, 2025
HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
News January 18, 2025
RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!
ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది.