News September 4, 2025

HYDలో నిమజ్జన ఏర్పాట్లకు ALL SET!

image

నగరంలో ఈనెల 6వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 30 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. 13 కంట్రోల్ రూమ్‌లు, నిమజ్జనానికి 20 ప్రధాన చెరువులు, కృత్రిమ కొలనులు 72, స్థిర క్రేన్లు 134, 259 మొబైల్ క్రేన్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు 56,187, హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 20మంది గజఈతగాళ్లు, శానిటేషన్ సిబ్బంది 14,486 ఉండనున్నారు.

Similar News

News September 6, 2025

కొండపల్లి అడవిలో జలపాతాల అందాలు చూసొద్దాం.!

image

విజయవాడ సమీపంలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్, సెలవు రోజుల్లో పర్యాటకులతో కళకళలాడుతోంది. మూలపాడు నగరవనంతో పాటు, సహజసిద్ధమైన జలపాతాలు, వెదురు వనాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అనేక మంది యువత ఇక్కడి నీటి పాయల్లో సందడి చేస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే నగర ప్రజలు ప్రశాంతత కోసం ఈ అడవిని సందర్శిస్తున్నారు. కొండపల్లి ఖిల్లా వంటి పర్యాటక ప్రాంతాలు కూడా సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.

News September 6, 2025

తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

image

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.

News September 6, 2025

NLG: రేపు నల్గొండలో బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 7న జిల్లాకేంద్రంలోని HYD రోడ్డు విద్యుత్ పోల్ సెంటర్ క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి బయ్యన్న తెలిపారు. జనగామ జిల్లాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ఎంపికైన క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు.