News March 28, 2025
HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్‌లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.
Similar News
News March 31, 2025
హెడ్‌కు స్టార్క్ దెబ్బ

SRH స్టార్ బ్యాటర్ హెడ్‌కు స్టార్క్ పీడకలలా మారారు. టాప్ లెవెల్ క్రికెట్లో స్టార్క్.. హెడ్‌ను 8 ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశారు. 34 బంతులు వేసి 18 రన్స్ మాత్రమే ఇచ్చారు. తన భయంతోనే హెడ్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోలేదని నిన్న మ్యాచ్ అనంతరం స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా నిన్న SRHపై స్టార్క్ 5 వికెట్లు పడగొట్టి MOMగా నిలిచారు. గతేడాది క్వాలిఫైయర్-1, ఫైనల్లో స్టార్క్ SRHను దెబ్బకొట్టారు.
News March 31, 2025
బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News March 31, 2025
పెద్దపల్లి: ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక పార్థనలు

పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లి రోడ్ వద్ద గల ఈద్గాలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాసాలు చేసి రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు సందేశం తెలిపారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.