News March 27, 2025

HYDలో నేడు డబుల్ ధమాకా

image

HYDలో IPL సంబరాలు నేడు అంబరాన్ని అంటనున్నాయి. వినోదానికి ఉర్రూతలూగించే సంగీతం జతకానుంది. నేడు ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు SRH VS LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో తమన్‌ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఉంది. ఇంకేముంది క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ తగ్గేదే లే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన

image

TG: బీసీ నినాదంతో MLC తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గం.11AMకు ఈ కార్యక్రమం జరగనుంది. ‘బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి’ అని మల్లన్న ఆకాంక్షించారు.

News September 16, 2025

చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: MP కావ్య

image

మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. తిరుపతిలో మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ “POSH చట్టం అమలు, 2013” అనే అంశంపై పలు బ్యాంకుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. పోష్ చట్టంపై మహిళలందరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీ పేర్కొన్నారు.

News September 16, 2025

మాదకద్రవ్యాలు సమాజానికి ప్రమాదకరం: ఎస్పీ

image

జిల్లాలో గంజాయి సహా నిషేధిత మారకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం, సాగు విస్తరిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వాటిని అరికట్టేందుకు సమగ్ర వ్యూహరచనతో చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. మాదకద్రవ్యాలలు సమాజానికి ప్రమాదకరమని, ఇవి యువతను, కుటుంబాలను దారి తప్పించి, శాంతి భద్రతలకు ముప్పు తెస్తాయన్నారు.