News December 10, 2025

HYDలో ​నైట్ లైఫ్‌కు కేఫ్ కల్చర్ కిక్

image

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్‌స్పాట్‌లు ఉంటాయి. వైన్-డైన్‌కు బదులు కాఫీ, ఫుడ్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.

Similar News

News December 11, 2025

పదేళ్ల తర్వాత జాతీయ స్థాయి పోటీలు: రాంప్రసాద్ రెడ్డి

image

AP: రాష్ట్రంలో పదేళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యోనెక్స్-సన్‌రైజ్ 87వ జాతీయ పోటీల పోస్టర్‌ను CM చంద్రబాబు ఆవిష్కరించగా ఆయన్ను ప్రారంభోత్సవానికి మంత్రి ఆహ్వానించారు. DEC 24-28వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని CMకు వివరించారు.

News December 11, 2025

కామారెడ్డి: విధులకు గైర్హాజరు.. 53 మందికి షోకాజ్ నోటీసులు

image

కామారెడ్డి జిల్లాలో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులకు కేటాయించిన 53 మంది అధికారులు బుధవారం డ్యూటీలో రిపోర్టు చేయలేదు. దీంతో ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసినందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DEO రాజు పేర్కొన్నారు.

News December 11, 2025

గురజాల సబ్ డివిజన్‌లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

గురజాల సబ్ డివిజన్ పరిధిలో గురువారం 1144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట్రామిరెడ్డి సరెండర్ అవుతారనే సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కారణంగా ఎటువంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని, శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీ కోరారు.