News May 7, 2025

HYDలో ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ స్లోగన్స్!

image

పహల్గామ్‌ ఉగ్రదాడిని హైదరాబాదీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సిటీలోని రహదారుల మీద కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ వద్ద శుక్రవారం ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ ముస్లిం సోదరులు కదం తొక్కారు. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. ఇక ట్యాంక్‌బండ్‌ మీద CM రేవంత్ రెడ్డి క్యాండిల్ మార్చ్‌‌కు వేలాదిమంది నగరవాసులు తరలివచ్చారు. ఉగ్రదాడి పట్ల HYDలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News April 9, 2026

ఎవరు ఈ గుండా జయప్రకాశ్ నాయుడు.. సర్వత్రా ఇదే ప్రశ్న

image

పశ్చిమగోదావరి జిల్లా జనసేన నేత, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడిపై భీమవరానికి చెందిన మద్దాల విజయలక్ష్మి <<19600376>>తీవ్ర ఆరోపణలు<<>> చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగినవని చెబుతున్న ఆడియో సంభాషణలు SMలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారడమే కాకుండా, జనసేన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది.

News April 9, 2026

GWL: అవగాహనతో ఎయిడ్స్ నిర్మూలన- కలెక్టర్

image

ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి అని ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందన్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ రోగులకు వాడిన సిరంజీలతో ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపారు.

News April 9, 2026

ఓటేసిన ప్రముఖులు.. PHOTOS

image

కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి రెండు గంటల్లో కేరళంలో 16.23, అస్సాంలో 17.87, పుదుచ్చేరిలో 17.71 శాతం పోలింగ్ నమోదైంది. కేరళంలో సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటేశారు.