News August 22, 2024

HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

image

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.

Similar News

News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.

News September 27, 2024

సీఎం‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

image

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 26, 2024

గచ్చిబౌలి: మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచారు: సీపీ

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా పోరాట శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.