News December 19, 2025
HYDలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

నగరంలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖచిత్రం మారబోతోంది. జనగణన తర్వాత జరిగే పునర్విభజనతో గ్రేటర్‌లోని సీట్లు 24 నుంచి ఏకంగా 30-33 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం GHMC వార్డుల విభజనలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జనాభా 5 లక్షలు దాటినట్లు గుర్తించారు. మితిమీరిన జనాభా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వీటిని చీల్చి, కొత్త స్థానాలను ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News December 21, 2025
HYD: కొండెక్కిన కోడి గుడ్డు ధర

సామాన్యుడి నిత్యవసర వస్తువుగా మారిన కోడి గుడ్డు ధర HYD, ఉమ్మడి రంగారెడ్డిలో కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.8, 9 ఉండగా, హోల్ సేల్‌లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రూ.5- 6 పలికే గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో బ్యాచిలర్లు, వర్క్ అవుట్స్ చేసేవారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీ చరిత్రలో రికార్డు అని, ఉత్పత్తి తగ్గడమే ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు.
News December 21, 2025
HYD: ఇలా చేస్తే మీ వాట్సాప్ హ్యాక్

‘హేయ్.. మీ ఫొటో చూశారా?’ అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. తెలిసిన వారి నుంచి వచ్చినా పొరపాటున కూడా క్లిక్ చేయొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్ అని, ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుందన్నారు. ఓటీపీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుందన్నారు.
News December 21, 2025
HYD: బాబోయ్.. ఇదేం చలిరా బాబూ

నగరం చలికి వణికిపోతోంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్ లేనిదే బయటకు వెళ్లడం కష్టమైపోతోంది.
నగరగంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ దారుణంగా ఉంటోంది. ఈ పరిస్థితి మరో 3 రోజులు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరిక. శేరిలింగంపల్లిలో 6.3, రాజేంద్రనగర్‌లో 7.4, మల్కాజిగిరిలో 7.5, చందానగర్‌లో 8.4, అల్వాల్‌లో 9.4°Cనమోదై చుక్కలు చూపుతోంది.


