News November 25, 2024

HYDలో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

HYD, ఉమ్మడి RR జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున‌ వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త!
SHARE IT

Similar News

News November 11, 2025

జూబ్లీబైపోల్: 9:30 గంటలకు Voter Turnout

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ తెలిపారు. పలుచోట్ల EVM యంత్రాలు మొరాయిస్తుండగా చర్యలు చేపట్టి, పునరుద్ధరించారు. ఫస్ట్ ఓటర్ టర్న్ అవుట్ ఉదయం 9:30 గంటలకు అందుబాటులో ఉంటుందని ECVT టీం తెలిపింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఓటు వేశారు? పర్సంటేజ్ ఎంత? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

News November 11, 2025

HYD: ఓటు వేసి ఈ పని చేయండి

image

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్‌ బూత్‌కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్‌ పెట్టి మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్‌ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

image

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్‌ డేట్‌. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్‌ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.