News June 26, 2024

HYDలో పెరిగిన బస్‌‌పాస్ కౌంటర్లు.. ఆదివారం సెలవు!

image

నగరంలో‌ నూతనంగా 2 బస్‌పాస్‌ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్‌స్టాప్‌లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్‌పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది.
SHARE IT

Similar News

News June 29, 2024

HYD: నర్సింగ్ అధికారుల పాత్ర కీలకం: ప్రొ.కోదండరాం

image

ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారుల పాత్ర కీలకమైందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో HYD పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన సంఘ రాష్ట్రస్థాయి సదస్సులో కోదండరాం ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News June 29, 2024

HYD: నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను: MLA

image

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

News June 28, 2024

BREAKING: HYD: శంషాబాద్‌లో విషాదం

image

HYD శంషాబాద్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీదర్ వాసి ప్రియాంక(26).. కుమారుడు అద్విక్(3), కుమార్తె ఆరాధ్య(7 నెలలు)తో కలిసి శంషాబాద్ RB నగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పిల్లలకు విషమిచ్చి ప్రియాంక ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు వచ్చి పిల్లలను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.