News February 26, 2025
HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News February 26, 2025
హాలీం వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం

రంజాన్ పర్వదినాలలో భాగంగా హలీం విక్రయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్టిజోన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ సర్కిళ్లకు చెందిన హలీం విక్రయదారులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి హలీం తయారీలో తీసుకోవాల్సిన పరిశుభ్రత చర్యలు, వాటిని సజావుగా పంపిణీ చేయటంపై పలు అంశాలను వ్యాపారులకు సూచించారు.
News February 26, 2025
రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఫరూఖ్‌నగర్‌లో 37.7℃, మొయినాబాద్‌లో 36.7, హయత్‌నగర్‌లో 36.5, మొయినాబాద్‌లో 36.3, మొయినాబాద్‌లో 36.2, శేరిలింగంపల్లిలో 35.9, షాబాద్‌లో 35.8, ఇబ్రహీంపట్నంలో 35.7, శంకర్‌పల్లి, సరూర్‌నగర్‌లో 35.4, చేవెళ్లలో 35.3℃ ష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నీ ఎల్లో జోన్‌లో ఉన్నాయి.
News February 25, 2025
HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.