News February 16, 2025
HYDలో ప్రేమికుల రోజు LOVER సూసైడ్

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్‌పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్‌డే రోజు ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.
Similar News
News February 19, 2025
గన్‌ఫౌండ్రీ: ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీఓస్ అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్‌కార్డ్స్, పీఆర్సీ, పెండింగ్ డీఏ సమస్యలు పరిష్కరించాలన్నారు.
News February 19, 2025
ప్రాజెక్టులకు కేంద్రం సహాయం కోరిన మంత్రి

రాజస్థాన్‌లో జరిగిన జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సులో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేవశీష్ ముఖర్జీతో బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, PRLIS, సీతారామ, సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుల నిధులు, మూసీ నది పునరుద్ధరణ, NDSA నివేదిక వేగంగా విడుదలపై కేంద్ర సహాయం కోరారు.
News February 19, 2025
రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.